Gospel Songs Ministry

20, నవంబర్ 2020, శుక్రవారం

రారాజు పుట్టినడు

 

రారాజు పుట్టినడు నేడు ఇలలో
సంతోషమె తెచ్చినాడు జగతిలో
ఉహించలేనిదయినా కలలో
ఒక్కడుగా చేరెనే మనలో  || 2 ||
వేవెలా దూతలు స్తోత్రాలు పాడెను
ప్రభువు రాకతో హృదయాలు వెలిగెను || 2 ||

చీకటి రాజ్యాలు కూలిపోయెను
మరణము సంకెళ్లు విడిపోయెను || 2 ||
ప్రేమకు రూపం దొరికింది నేడు
దేవుడే భువి దిగి వచ్చినాడు || 2 ||
ఆనందమానందం సాగాలి సంబరం
సాతాను పైన నేడు గెలవాలి సమరం || 2 || || రారాజు || 

బానిసలు అయిన మనుషులను చూసి
నరకమును చేర్చె పాపాలపై రోసి  || 2 ||
వెలను చెల్లించాలని వచ్చినాడు
తనను చేర్చె రక్షణను తెచ్చాడు || 2 ||
అందరమూ చేరి చేయాలి పండుగ
రక్షణ ఫలములు పొందాలి నిండుగా || 2 || || రారాజు || 

రారాజు పుట్టినడు నేడు ఇలలో
సంతోషమె తెచ్చినాడు జగతిలో
ఉహించలేనిదయినా కలలో
ఒక్కడుగా చేరెనే మనలో  || 2 ||
రేపోమాపో  అని  ఆలస్యం చెయ్యక
యేసును చెరగా అడుగేయ్ నువ్ వెరవక || 2 ||

5, నవంబర్ 2020, గురువారం

దేవుడు దేహమును

 

దేవుడు దేహమును పొందిన దినము
మనిషిగా మారి ఇలను చేరిన క్షణము   || 2 ||
తార వెలిగెను - దూత పాడెను
పరలోకానికి  మార్గము వెలిసెను  || 2 ||
స్తుతుల గానములు  పాడి పరవశించెదము
యేసు నామమునే  చాటి మహిమ పరిచెదము  || 2 ||

దూత పలికెను భయము వలదని
తెలిపే వార్తను  యేసే  క్రీస్తని || 2 ||
చీకటి తొలగెను రారాజుకు  భయపడి
లోకము వెలిగెను  మరణము చెరవిడి  || 2 ||
క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము
నిత్య జీవమునే చాటి  ఘనత పొందెదము  || దేవుడు ||

సృష్టి కారుడు  అల్పుడాయెను
అది శాపము తియ్య  వచ్చెను || 2 ||
పాపము  ఎరుగని మనిషిగా బ్రతికేను
మానవ జాతికి మార్గమై నిలిచెను  || 2 ||
నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు
పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు  || దేవుడు ||

22, అక్టోబర్ 2020, గురువారం

దేవా ఇలలోన నీవు


దేవా ఇలలోన  నీవు మాకిచ్చిన గృహము
మా తోడుగా కొలువుండే నీదు ఆలయము || 2 ||
మా యజమానివి నీవై మమ్ములను నడిపించు
నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు || 2 ||
వందనములు  అందుకో మా యేసయ్య
కలకాలం నీ కాపుదలే కావలయ్యా || 2 ||  || దేవా ఇలలో ||

నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమయిన లేదయ్యా
పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్య  || 2 ||
ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్య
నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావ || వందనములు ||

నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ 
నీ నీడలో మె సాగుటకు మా గృహమును కట్టుమయ   || 2 ||
శోధన, వేదనలేదిరించే బలమును అందించుమయ్య
నీ కృపలను చాటించెటి సాక్షములతో నింపుమయ్య || వందనములు ||

నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మెముండాలి
నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి || 2 ||
సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి
కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి || వందనములు ||

14, ఆగస్టు 2020, శుక్రవారం

సువార్త మోసిన పాదములు



సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు, ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు || 2 ||
ఏ లేమికి కలత చెందరు, ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు, తన చిత్తము ఎరిగిన వారు || 2 ||

యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు || 2 ||
తమ సిలువను ఎత్తుకొని, ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి,  తన  సన్నిధినె చేరారు  || 2 ||  || ఏ లేమికి కలత ||

లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు || 2 ||
తమ దేహము యాగముగా, శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని, ప్రభు రక్షణను పంచారు || 2 ||  || ఏ లేమికి కలత ||

7, జులై 2020, మంగళవారం

Heavenly Father



Oh! Jesus, you’re my Heavenly Father
You're my one and only caretaker I sing for you, Lord! I thank you always || 2 || You protected me from each and every trouble Now bless and guide me to be more fruitful || 2 || I sing for you, Lord! I thank you always || 2 || I humbly pray that you bless my new age I pray that you go before me all the way || 2 || I sing for you, Lord! I thank you always || 2 || If you're not there nothing is achievable Give me the wisdom to be more usable || 2 || I sing for you Lord! I thank you always!! || 2 || Oh! Jesus, you’re my Heavenly Father You're my one and only caretaker I sing for you, Lord! I thank you always || 2 ||

3, జులై 2020, శుక్రవారం

మరువని నీదు ప్రేమతో



మరువని నీదు ప్రేమతో కాచితివే కను పాపగా
విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా  || 2 ||
ఇంతవరకు ఉన్న ఊపిరి  నీదు దయకు సాక్షమేగా
పొందుకున్న మేలులన్నీ నీదు ఎన్నిక పలితమేగా  || 2 ||  || మరువని  ||

కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపే
వెలుగు పంచె నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపే || 2 ||
పాడెదను నూతన గీతములు  ఎలా వేళలా స్తుతిగానములు
ఘనత, మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము  || మరువని ||

నిన్న నేడు ఎన్నడయినా మారిపోని మనసు నీది
తల్లి మరచిన మరచి పోక కాపు కాసే ప్రేమ నీది  || 2 ||
పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయ కిరీటము
నీవు ఇచ్చె వాగ్దానలు చేయు అధికము బ్రతుకు దినములు || మరువని ||

2, మే 2020, శనివారం

అమ్మ నీ ఋణమును



దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం
"అమ్మ" అంటూ పిలుచుకొని పొందుకొనేను జన్మం
నీకంటూ  ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం
కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం || 2 ||

"అమ్మ" నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో
ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో  || 2 ||  || దేవుడే ||

కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం
తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం  || 2 ||
మోషేగా మారిన అపసివాడిని,  దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం  || "అమ్మ" ||

సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం
దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను  మాతృత్వం || 2 ||
హాన్న చేసిన ఆ త్యాగమే కాదా? సమూయేలు పొందిన న్యాయాధిపత్యము || "అమ్మ" ||

కోన ఊపిరితో సిలువపైన వేలాడుతున్నా క్షణము
ఆ దేవా దేవుడు తీర్చుకొనెను తన  మాతృమూర్తి ఋణము || 2 ||
ప్రియా శిష్యుని దరికి తల్లిని చేర్చి నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం || "అమ్మ" || 

20, ఏప్రిల్ 2020, సోమవారం

కరుణఁచూపించుమా



కరుణఁచూపించుమా యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా యేసయ్య స్వస్థతలు చూపగా || 2 ||
నీ ప్రజలము అయినా మేము మృత్యువు కోరలో చిక్కము
ఏ దారియు  కానరాక  నశియించి పోతున్నాము || 2 ||
కరుణగల దేవుడు నీవు! కరుణించి కాపాడుమా

ఐగుప్తులో పది తెగుల్లలో నీ ప్రజలను కాపాడితివి
గొఱ్ఱె పిల్ల రక్తము నిచ్చి మృత్యువాత తప్పించితివి || 2 ||
నీ నామము మదిలో నిలిపి ఈ ఆపదలో వేడాము
నీ మహిమను తిరిగి చూడగా నీ సన్నిధిలో చేరాము || 2 ||  || కరుణగల ||

ఇశ్రాయేలు వారిగా మెము నీ ఉనికిని ప్రశ్నించాము
నీ ప్రేమను రుచి చూసినను మారాను కురిపించాము || 2 ||
చెలరేగే సర్పము కాటు మములను కబళించే వేళ
మాకు దిక్కు నివేనంటూ మోకరించి నిను వేడితిమి || 2 ||  || కరుణగల ||

మరణమునే  జయించి నీవు సజీవుడిగా నిలిచావు
నిన్ను నమ్మి వేడిన చాలు మా తప్పులు మరిచావు || 2 ||
నేను జీవించితి గనుక మీరును జీవించెదరన్న
వాగ్దానము నమ్మితిమయ్యా నెరవేర్చుము మా యేసయ్య  || కరుణగల || 

12, మార్చి 2020, గురువారం

కల్వరిలోన చేసిన యాగం



కల్వరిలోన చేసిన యాగం
మరణము గెలిచిన! నీ యొక్క  త్యాగం || 2 ||
కడిగి వేసెను, నాదు పాపం
నిలిపే నాలో - నీ స్వరూపం  || 2 ||  || కల్వరి ||

ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు
తొలగించేను నాపై  ఉన్న ఆ ఘోర శాపాలు
పరిశుద్ధ దేహముపై చెలరేగేను కొరడాలు
నాలోని రోగాలకై పొందితివా? గాయాలు  || 2 ||
దైవసుతుడవే! అయినా గాని
కనికరము వీడవేలా!  క్షణమైన గాని (2) || కల్వరి ||

ఏ దోషం లేని దేహం,  మోసెను సిలువ భారం
రద్దయెను నాలో  నేరం, తగ్గించేను  నా భారం
నువు  పొందిన అవమానం - నను ఉన్నతి చేర్చెను
చిందించిన నీదు  రక్తం -  పరిశుద్దుతనిచ్చేను || 2 ||
నిన్నే బలిగా నువ్వు  మార్చుకుంటివి!
నన్ను రక్షించుటకు - వేధన పడితివి (2)  || కల్వరి ||

సిలువలో వ్రేలాడుతూ నువు పొందిన దాహము
అందించేను  నాకొరకై  ఆజీవ జలము
కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు
నింపెను నాలో  మధురం, తొలగించే నా కుటిలం || 2 ||
అధికారమే లేని మరణము నిలిచెను
నిన్ను  తాకేందుకు! అనుమతి కోరెను (2)  || కల్వరి ||

24, జనవరి 2020, శుక్రవారం

అధర మధుర



అధర మధుర సుమధుర భరితము - యేసు నీదు నామము
సకల లోకుల పాప హరణము - యేసు నీదు రుధిరము
దీన జనముకు నీవే శరణము  || 2 ||
దిటవు నొసగును నీదు చరణము  || 2 || || అధర ||

కన్య గర్భము నందుదయించుట
సృష్టికారుడు నరునిగా మెలఁగుట || 2 ||
పాఁడి కాదుగ పరమున్-విడుచుట || 2 ||
దైవ తనయుడు హింసల్-బొందుట || 2 || || అధర ||

తరువు బరువు లో కలుషము మోసిన
గాయముల్-బడి మరణము గెలిచిన || 2 ||
శోధకుని లయల్-కంతము బలికిన || 2 ||
పరమున్ జెరగ-మార్గమున్ జూపిన || 2 ||  || అధర ||