Gospel Songs Ministry

18, డిసెంబర్ 2018, మంగళవారం

పుట్టినాడంట యేసు నాథుడు



తూరుపు దిక్కున చుక్క బుట్టే
దూతలు పాటలు  పాడ వచ్చే || 2 ||
చలిమంట లేకుండా ఎలుగె బుట్టె || 2 ||
చల్లని రాతిరి కబురే దెచ్చె  || 2 ||

పుట్టినాడంట యేసు నాథుడు - పాపములు దిసె పరమాత్ముడు || 2 ||

గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి -  కొలిచినరు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చెరుదాము -  కాపరిని కలిసి వెడుదాము | | 2 ||  || పుట్టినాడంట ||

చిన్న పెద్ద తనకు తేడా లేదు - పేద ధనిక ఎపుడు చూడబోడు
తానొక్కడే అందరికి రక్షకుడు  - మొదలు నుండి ఎపుడు ఉన్నవాడు || 2 ||  || పుట్టినాడంట ||

లోకలను తాను కాయు వాడు  - స్వచ్చమయిన మనిషి మనలాంటోడు
పాపమంటే  అసలు  ఎరుగనోడు -  మనకోసమె  ఇపుడు దిగి వచ్చాడు  || 2 ||  || పుట్టినాడంట ||

మంచి చెడ్డ ఎన్నడూ ఎంచబోడు - చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు - తన ప్రేమను నీకు అందిస్తాడు || 2 ||  || పుట్టినాడంట ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి