Gospel Songs Ministry

24, ఫిబ్రవరి 2024, శనివారం

నను దీవించావు

 

ఎన్నెనో మేలులతో నను దీవించావు
నా జీవితకాలమంత యెరిగి ఉన్నావు
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఎన్ని రీతులుగా కీర్తించగలను
 
వందనాలు యేసయ్య నీకే
శతకోటి స్తోత్రలయ్యా నీకే || 2 || || ఎన్నెనో మేలులతో ||
 
కష్టాల మార్గములో అలసిన పయణములో
నిందలు మోయలేక కృంగిన సమయములో  || 2 || 
సంపూర్ణముగా నాకు పరిశుద్దతనిచ్చావు
సమాధాన కర్తవు నీవై నన్ను ఆదరించావు  || 2 ||   || వందనాలు ||

ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో
అలజడి అలలెన్నో చెలరేగెను నా మదిలో || 2 || 
కలవరమును కరిగించి, కరుణను కురిపించావు
నా భయమును గద్దించి, నీ శాంతితో నింపావు  || 2 ||   || వందనాలు ||

కలిగేటి శోధనలు, కనపడని మార్గములు
నీ వాక్యమే దీపముగా, సాగెను నా పాదములు  || 2 || 
అపవాదిని నా చేత, ఓడింప జేసావు
వాగ్దాన పూర్ణుడిగా జయ జీవిత మిచ్చావు  || 2 ||   || వందనాలు ||