కల్వరిలోన చేసిన యాగం
మరణము గెలిచిన! నీ యొక్క త్యాగం || 2 ||
కడిగి వేసెను, నాదు పాపం
నిలిపే నాలో - నీ స్వరూపం || 2 || || కల్వరి ||
ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు
తొలగించేను నాపై ఉన్న ఆ ఘోర శాపాలు
పరిశుద్ధ దేహముపై చెలరేగేను కొరడాలు
నాలోని రోగాలకై పొందితివా? గాయాలు || 2 ||
దైవసుతుడవే! అయినా గాని
కనికరము వీడవేలా! క్షణమైన గాని (2) || కల్వరి ||
ఏ దోషం లేని దేహం, మోసెను సిలువ భారం
రద్దయెను నాలో నేరం, తగ్గించేను నా భారం
నువు పొందిన అవమానం - నను ఉన్నతి చేర్చెను
చిందించిన నీదు రక్తం - పరిశుద్దుతనిచ్చేను || 2 ||
నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి!
నన్ను రక్షించుటకు - వేధన పడితివి (2) || కల్వరి ||
సిలువలో వ్రేలాడుతూ నువు పొందిన దాహము
అందించేను నాకొరకై ఆజీవ జలము
కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు
నింపెను నాలో మధురం, తొలగించే నా కుటిలం || 2 ||
అధికారమే లేని మరణము నిలిచెను
నిన్ను తాకేందుకు! అనుమతి కోరెను (2) || కల్వరి ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి