Gospel Songs Ministry

18, నవంబర్ 2023, శనివారం

శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు (Female)

 

శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు  ఇలలోన 
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 || 

ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు 
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు || 2 || 

ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము 
ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము  || 2 ||  || శ్రీయేసు || 

పాపాలకు, మన లోపలకు  - ఇఁక చెల్లి పోయింది  కాలము
మనలోన చీకటి, తొలగించగా -  నేడు తెచ్చాడు మనకై తన తేజము  || 2 ||
వేలాది సూర్యులంత వెలుగున్న వాడు
వెలలేని మనిషిగా మనలా మెలిగాడు || 2 ||  || ఓ అయ్యా || 

మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన  సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము || 2 || 
ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను
మహిమలో నిలపాలని మహిమ విడిచాడు || 2 ||  || ఓ అయ్యా ||

8, నవంబర్ 2023, బుధవారం

శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు (Male)

 

శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు  ఇలలోన 
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 || 

ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు 
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు || 2 || 

ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము 
ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము  || 2 ||  || శ్రీయేసు || 

పాపాలకు, మన లోపలకు  - ఇఁక చెల్లి పోయింది  కాలము
మనలోన చీకటి, తొలగించగా -  నేడు తెచ్చాడు మనకై తన తేజము  || 2 ||
వేలాది సూర్యులంత వెలుగున్న వాడు
వెలలేని మనిషిగా మనలా మెలిగాడు || 2 ||  || ఓ అయ్యా || 

మరణము చెరలను గెలిచేందుకు - ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన  సన్నిధిని విడిచిన మనలను - చేర్చేందుకయినాడు తను మార్గము || 2 || 
ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను
మహిమలో నిలపాలని మహిమ విడిచాడు || 2 ||  || ఓ అయ్యా ||

16, ఆగస్టు 2023, బుధవారం

ఆశ్చర్యమైన ప్రేమ!

 

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ 
మరణము కంటె బలమైన ప్రేమది 
నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన||

పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన||

పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే ||ఆశ్చర్యమైన||

శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన||

నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్యమైన||

29, జూన్ 2023, గురువారం

సరిపోదు ఆరాధన!

 

నిరతము నిను స్తుతియించినా, దేవా ! సరిపోదు ఆరాధన
ప్రతి క్షణము కీర్తించినా, ప్రభువా ! నీ కృపలకు సరితూగునా ? || 2 ||

ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన నికే ఆరాధన || 2 ||

ప్రభువా యెహోవా రాఫా నివే- నా స్వస్థతలు అన్ని నీవే నీవే
దేవా యెహోవా నిస్సి నీవే - నా విజయాల అధిపతి నీవే నీవే || ఆరాధన ||

ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా - కోపానికి కాలయాపన నీదే ప్రభువా
నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా - నీతోడు ఉంటె నాదరి రాదు ఏ భాధ || ఆరాధన ||

నా గతము రద్దు చేసిన నాదు దేవా - నా రేపటిని నడిపెది నీవే ప్రభువా
నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా - నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా || ఆరాధన ||

5, మార్చి 2023, ఆదివారం

పెళ్లి కూతురు!

 

అందమయిన మనసుకు - నేనొక చక్కని రూపం
బుద్ధిమంతురాలు ఎస్తేరుకు - నిలువెత్తున ప్రతిరూపం  || 2 || 
హద్దులెవి దాటి ఎరుగవు నా ఊహలు
దేవుని పలుకులే నింపెను నా ఆశలు || 2 ||  || అందమయిన || 

ఇస్సాకు వంటి వానితో నా మనువు సేయ వెదికేరు
రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు  || 2 || 
మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం
రుతులాగా కలిసిపోవడం నాకున్న గుణం  || 2 ||  || అందమయిన || 

శుద్ధమయిన మరియామ్మ లాగ బుద్దిగా పెరిగాను
నీతిమంతుడయినా యోసేపు కై కాచుకొని ఉన్నాను  || 2 ||
తండ్రి చిత్తమేదయినా పాటించుటకై సిద్దము
పొందుకున్న మారు మనసే,  నా అందము || 2 || || అందమయిన || 

అమ్మ నాన్నల నుండి నేను, ప్రార్థన పలుకులు నేర్చాను
నా తొడబుట్టిన వారి తోని, అనుబంధాలే ఎరిగాను || 2 ||
క్రీస్తు సంఘమంత మాతో ఉన్న బంధు ఘనం 
కనాను పెండ్లిలో అద్భుతమే మాకున్న ధైర్యం || 2 ||  || అందమయిన ||