Gospel Songs Ministry

30, డిసెంబర్ 2018, ఆదివారం

గడిచిన కాలమంతా



గడిచిన కాలమంతా నను నడిపిన  నా దేవా
నీకంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా  || 2 ||

మరో యెడు నాకొసగినందుకు! నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు! నిన్నేమని కీర్తింతును || 2 || || గడిచిన ||

ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు
శూన్యమందయిన సకలం సాధ్య పరచెదవు  || 2 ||
నామేలు కోరి నీ ప్రేమతో  నను దండించితివి
చేలరేగుతున్న డంబములు నిర్మూల పరచితివి || 2 ||  || మరో యెడు ||

నాదు కష్ట కాలములోన  కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా || 2 ||
నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి
నీ ప్రేమతో నను పోషించి సత్తువ నింపితివి  || 2 ||   || మరో యెడు ||

2 కామెంట్‌లు: