Gospel Songs Ministry

17, డిసెంబర్ 2021, శుక్రవారం

రారే చూతము రాజ సుతుని


రారె చూతము – రాజసుతుడీ – రేయి జనన మాయెను రాజులకు రా – రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో॥రారె॥

దూత గణములన్ – దేరి చూడరే – దైవ వాక్కులన్ – దెల్పగా దేవుడే మన – దీనరూపున – ధరణి కరిగెనీ – దినమున॥రారె॥ కల్లగాదిది – కలయు గాదిది – గొల్ల బోయల – దర్శనం తెల్లగానదె – తేజరిల్లెడి – తారగాంచరె – త్వరగ రారే॥రారె॥ బాలు డడుగో – వేల సూర్యుల – బోలు సద్గుణ – శీలుడు బాల బాలికా – బాలవృద్ధుల నేల గల్గిన – నాధుడు ॥రారె॥

18, నవంబర్ 2021, గురువారం

లాలి లాలి జొలాలి


లాలి లాలి జొలాలి బాల యేసునకు లాలి
కన్య మరియా తనయునకు పాడరండి జొలాలి || 2 ||
లోక రక్షణకునకు లాలి - శాంతి  కర్తకు జొలాలి   || 2 ||
మాదు తండ్రికి మా లాలి || 2 || || లాలి లాలి ||

చీకటి దొంతర తెరలకు, తెరను దింపగా వచ్చినవని
పాప శాపపు తాపములకు రక్షణను ఇల తెచ్చినవని || 2 ||
మానవుల మోచకుడా లాలీ - ధరణిఁ పై దైవమా జోలాలి || 2 ||
మాదు తండ్రికి మా లాలి || 2 || || లాలి లాలి ||

దారి తెలియని మానవాళికి దారి నీవై వెలసినవని
మరణ ఛాయలు రూపుమాపగ జీవ కిరణమై మెరిసినావని || 2 ||
సత్య రూపునకు లాలి -  నీతి సూర్యునకు జోలాలి  || 2 ||
మాదు తండ్రికి మా లాలి || 2 ||  || లాలి లాలి ||

29, అక్టోబర్ 2021, శుక్రవారం

అందాల బాలుడు


అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు  || 2 || 
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను 
ప్రేమను పంచెట్టి రక్షణను తెచ్చెను  || 2 ||  || అందాల || 

భీతిల్లి పోయాము అ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునె గాంచి || 2 || 
గొల్లలము మేము కల్లలు ఎరుగము || 2 || 
కళ్లారా జూసాము తేజోమాయుని మోము || 2 ||   || రండయ్యో || 

తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము || 2 || 
దారి చూపే తార రారాజునె-జేర || 2 || 
మొక్కము మోఁకఱిల్లి బాలుణ్ణి మనసారా || 2 ||  || రండయ్యో ||

తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసెయు రక్షకుడు  || 2 || 
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు || 2 || 
నీ తప్పులెన్ని ఉన్న మన్నించుతాడు రేడు || 2 ||  || రండయ్యో ||

23, జులై 2021, శుక్రవారం

మధురం మధురం


మధురం మధురం నా ప్రియ యేసు 
నీ ప్రేమలో నను నే మరచితినయ్యా

వాడిన పువ్వులు వికసింప చేసి 
పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ
చెదరిన మనసును 
చెలిమతో చేర్చి సేదదీర్చిన యేసుని ప్రేమ

సాసనిసస నిసనిపాపస నిసనిపాపనిసా 
సససగ రిరిరిని సససని రిరినిస నిసనిపాపనిసా
మధురం . . . . మధురం . . . .
అతిమధురం నీ నామం 
కలువరి గిరికరుదెంచితి ప్రభుతో
కలుషమెల్ల బాపే కమణీయమైనా 
కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలుపే 
ఎటులనే . . . మరతును.... 
ప్రభుని ప్రేమ ఇలలో

17, మార్చి 2021, బుధవారం

కొంత యెడము నీవయినా


కొంత యెడము నీవయినా నే సాగలేను
నిమిషమయిన నిన్ను విడిచి నే బ్రతుక లేను  
కొంత యెడము నీవయినా

మరచిన వేళలో మది నీ పలుకులు 
సడలి కట్టడలు మలినము తలపులు  || 2 || 
ప్రేమను పంచే ప్రేమ రూపుడా || 2 || 
మరియొక్క మారు మన్నించు విభుడా || 2 ||  || కొంత యెడము || 

కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము  || 2 || 
కమ్మిన పొరలు కరిగించుటకు || 2 || 
నడుపు నీ వైపుకు హృది  వెలుగుటకు || 2 ||  || కొంత యెడము || 

మదము, మత్సరములు సోకిన తరుణము
పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము || 2 || 
నిరతము స్తిరముఁగ నున్న   అక్షయుడా || 2 || 
నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా || 2 ||  || కొంత యెడము || 

మనుజ రూపమున మహిలో నిలిచి
మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి || 2 || 
నను వరియించగ రానున్న ప్రియుడా || 2 || 
నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా || 2 ||  || కొంత యెడము || 

నా యేసయ్య - కొంత యెడము నీవయినా

1, జనవరి 2021, శుక్రవారం

ఎమున్నా లెకున్నా

 

ఎమున్నా లెకున్నా, నీవు నాతొ ఉన్నావు 
నీ కృప చాలునని, ధైర్యము నింపావు
మార్గమందు అలసితినా, మేఘమల్లె కమ్మేవు 
శత్రువులు తరిమెదర, యుద్ధమును గెలిచేవు || 2 || 
సకలము నీలో సృష్టించి ఉంటివి  
సర్వము నా మేలుకై జరిగించు చుంటివి || ఎమున్నా || 

వెయ్యి మంది పడిన, పదివేలు కూలిన
జడియను, వెరవను, వెనుకంజ వేయను || 2 || 
నీవు నన్ను హెచ్చించాలని నిశ్చయించిన
హద్దు ఉండునా, నాకు లేమి కలుగునా || 2 || || సకలము || 

ఏల నాకు ఈ సిరులు, ఈ లోక సంపదలు
పనికిరాని ఖ్యాతి, పదవి వెంపరలు 
కలిమి లెమిలో, శాంతి సమాధానము
నిండుగా నింపే యేసు నీతో స్నేహము || 2 || || సకలము ||