Thursday, February 28, 2019

కంట నీరేలా? కలతలు ఎలా?కంట నీరేలా? కలతలు ఎలా? యేసుతో ! నీవు సాగు వేళ శోధన వేళ ! రోదన ఎలా? నీ విశ్వసము! గెలిచే వేళ నమ్మిన ఆ దేవుడు - ఎన్నడూ నిను మరువడు నీయొక్క అవసరలు - ఏనాడో తానెరిగాడు || 2 || వలదు చింతన దేనికయినా విన్నవించుము నీ నివేదన || 2 || పొందితినను నీదు నమ్మకం - దరికి చేర్చు తగిన విజయము తిరుగన్నదే లేనివి - ఆ తండ్రి దీవెనలు || 2 || పొరపాటు ఎరుగనివి - తానిచ్చు ఆ మేలులు || 2 || || కంట || రేపు గూర్చిన భయము వలదు ప్రతి దినము తగు భాధ కలదు || 2 || నీ భారము మోయు దేవుడు - నీ ముందుగా నడుచు ఎప్పుడు నీలోన ఉన్న భయము - లోకానికి ప్రతి రూపము || 2 || స్థిరమయిన విశ్వాసం - దేవునికి ఆనందము || 2 || || కంట ||

No comments:

Post a Comment