Gospel Songs Ministry

1, నవంబర్ 2024, శుక్రవారం

బంగారము వీధులున్న

 

బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన రారాజు జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చేరినాడు పాపమూ శాపము లెన్నో ఉన్న జనమును కోరుకున్నాడు మనల చేర్చాలని తన కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు || బంగారము || తప్పుల అప్పుకు హద్దులు లేక బ్రతుకు భారమవుతుంటే తప్పులు మన్నించి బరువు దించమని తననే వేడుకుంటే || 2 || క్షణ కాలమైన ఆలోచించక తప్పులు మన్నించుతాడు మన శిక్షనంత చెల్లించటానికి పరము నుండి వచ్చినాడు || 2 || || బంగారము ||
పాపము నిండిన హృదములోన నీతి నింప వచ్చినాడు తనకెంత దూరము మనము వెళ్ళిన ప్రేమనంత పంచుతాడు || 2 || పాపపు బానిస జనమును పిలిచి స్నేహము అందించుతాడు మన దోషమంత రద్దు చేయుటకు రారాజు బంటు అయినాడు
బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన యేసయ్య జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చేరినవయ్యా పాపమూ శాపము లెన్నో ఉన్న జనమును కోరుకున్నావు మమ్ము చేర్చాలని నీ కొలువు లోనికి రాజ్యమునే విడిచావు

18, అక్టోబర్ 2024, శుక్రవారం

నను పేరు పెట్టి పిలిచినది!

 

నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా నా చేయి పట్టి నడిపితివి నీవే సదా పనికి రాని నన్ను నీ పాత్రగా మలచుటకు యుగయుగములు నీతో నే జీవించుటకు నిను నీవే నాకు బయలు పరచుకుంటివి నీ రక్షణ మార్గములోనికి నన్ను నడుపుచుంటివి || నను పేరు || తల్లి గర్భమందు నే రూపింపబడక మునుపే నీదు ప్రేమ జీవగ్రంథమందు నన్ను నిలిపే || 2 || ఎంతగా కరుణించితివో నీ నామము ఎరుగుటకు ఏ అర్హత చూసితివో నీ ప్రేమను పొందుటకు || 2 || || పనికి రాని || ఈ జగతికి పునాదులు వేయకన్నా ముందుగా నీ తలపులలో నేను నిలిచి యుంటి నిండుగా || 2 || నీదు ప్రేమ అవసరము నాకుందని గుర్తించి నీ ముద్రను వేసితివి సిలువలో నను రక్షించి || 2 || || పనికి రాని ||

24, ఫిబ్రవరి 2024, శనివారం

నను దీవించావు

 

ఎన్నెనో మేలులతో నను దీవించావు
నా జీవితకాలమంత యెరిగి ఉన్నావు
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఎన్ని రీతులుగా కీర్తించగలను
 
వందనాలు యేసయ్య నీకే
శతకోటి స్తోత్రలయ్యా నీకే || 2 || || ఎన్నెనో మేలులతో ||
 
కష్టాల మార్గములో అలసిన పయణములో
నిందలు మోయలేక కృంగిన సమయములో  || 2 || 
సంపూర్ణముగా నాకు పరిశుద్దతనిచ్చావు
సమాధాన కర్తవు నీవై నన్ను ఆదరించావు  || 2 ||   || వందనాలు ||

ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో
అలజడి అలలెన్నో చెలరేగెను నా మదిలో || 2 || 
కలవరమును కరిగించి, కరుణను కురిపించావు
నా భయమును గద్దించి, నీ శాంతితో నింపావు  || 2 ||   || వందనాలు ||

కలిగేటి శోధనలు, కనపడని మార్గములు
నీ వాక్యమే దీపముగా, సాగెను నా పాదములు  || 2 || 
అపవాదిని నా చేత, ఓడింప జేసావు
వాగ్దాన పూర్ణుడిగా జయ జీవిత మిచ్చావు  || 2 ||   || వందనాలు ||