Gospel Songs Ministry

6, డిసెంబర్ 2022, మంగళవారం

కదలిరా సువార్త చాటగా

 

నింగిలోన తారక
చేయ వచ్చింది వేడుక
దారి చూపేందుకు తోడుగా
తానే నడించింది ముందుగా || 2 ||
బెత్లహేములో పండుగ
వెలుగే వచ్చింది నిండుగా || 2 ||
రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా || 2 ||  || నింగిలోన ||

దూత వార్త వినగానే గొల్లలు
అందరికి చాటారు శుభములు
సువార్త మతికి రాగానే జ్ఞానులు
మోకరించి  ఇచ్చారు కానుకలు || 2 ||
కదలిరా సువార్త చాటగా
ప్రభువిచ్చెను మన భాద్యతగా || 2 ||
(ఆ) రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా || 2 || || నింగిలోన ||

లోకమునే రక్షించిన ఈ దినము
నీ హృదయములో రావాలి నిత్యము
ప్రభు యేసే దేవుడనే సత్యము
నమ్మి మోకరించాలి ఈ క్షణము || 2 ||
తన రక్తమే శుద్ధి చేయును
మన పాపములు రద్దు చేయును  || 2 ||
(ఆ) రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా || 2 || || నింగిలోన ||

30, అక్టోబర్ 2022, ఆదివారం

వెళ్లిపోవే గతమా!

 

వెళ్లిపోవే గతమా! చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం! గతించి పోయే నీ జీవనం || 2 || 

మనసు పై ఉన్న ఆ మచ్చలు
నా తప్పులకై ఉన్న నీ లెక్కలు || 2 ||
రద్దయెను ఆ సిలువలో! హద్దేలేని తన ప్రేమలో || 2 ||   || వెళ్లిపోవే గతమా || 

ఒప్పుకుంటేనే  నిన్ను నేను
గుర్తే రావంటా తనకే నీవు || 2 ||
నీ గురుతులు అన్ని మరచి! ప్రభు మార్గము నే సాగగా || 2 ||  || వెళ్లిపోవే గతమా || 

మదిలో చీకటిని పెంచే నువ్వు 
తన రక్షణ ముందు నిలువబోవు || 2 || 
ప్రభు వాక్యము వెలుగులోన, వెలిగితిని అణువణువణువున || 2 ||  || వెళ్లిపోవే గతమా ||

5, జులై 2022, మంగళవారం

చల్లని స్వరమే

 
చల్లని స్వరమే మెల్లగా పలికెను
తన సన్నిధిలో జోలలు పాడెను || 2 ||
లాలి లాలి యేసు ఒడిలో లాలి
దూతల స్తోత్రవళి నిదురలో నినుఁచాలి || 2 || || చల్లని స్వరమే ||

మా నవ్వుల పంట! దేవుని వరమే నీవు
ప్రార్థన ఫలితంగా మా బ్రతుకులో పండావు || 2 ||
నిదురలో కలల అలలపై తెలిపోతున్నావా
కను రెప్పలపై ఎగిరి ప్రభుతో ఆటలాడుతున్నావా || 2 || || లాలి లాలి ||

ప్రభు పనిలోన పాత్రగా నువ్వు వెలగాలి
తన ప్రేమను చాటే సాక్ష్యములను పొందాలి || 2 ||
అలసట కరుగులాగా ఆదమరచి నిదురపో
ప్రభు దయతో నువ్వెదిగి తనతో అలుపెరుగక సాగిపో || 2 || || లాలి లాలి ||

21, జూన్ 2022, మంగళవారం

ఈ మరణము - కాదు శాశ్వతము


ఈ మరణము - కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము ॥ 2 ॥
యేసు-తెచ్చెను మనకు రక్షణ
ఎంత-అద్బుతము ఆ నిరీక్షణ ॥ 2 ॥  ॥ ఈ మరణము॥

జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరొ- ఎవరికి  తెలియక ముందే ॥ 2 ॥
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి-తన దరికి మనల పిలిచె వెళ ॥ 2 ॥  ॥ ఈ మరణము॥

యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు ॥ 2 ॥
తిరిగి-లేచెదరు యేసు నామములో  
కొలువు తిరెదరు పరలోకంలో  ॥ 2 ॥  ॥ ఈ మరణము॥

కురిసే-ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము  మబ్బులను కరిగించును ॥ 2 ॥
వేదనలు-రోదనలు రద్దు చేయును
గతకాల-సంగతులు గతించి పోవును ॥ 2 ॥  ॥ ఈ మరణము॥

22, మార్చి 2022, మంగళవారం

ప్రతి క్షణం నీ నామమే!


ప్రతి క్షణం నీ నామమే నింపెను నాలోన జీవం
ప్రతి దినం నీ వాక్యమే చూపించెను నాకు మార్గం || 2 ||
నీవే నా సైన్యము దేవా ! నీవే నా ధైర్యము ప్రభువా !
నీవే లేకున్న! తోడు రాకున్న! మిగిలేను శూన్యము || ప్రతి క్షణం || 

నిమిషమయిన నిలువగలేను నె  నీదు మార్గమందు
క్షణ కాలమయిన విడిపోక కాచితివి నడిచి నాకు ముందు
ఎన్నెనో యోచనలు, కలుగు కోరికలు నాదు హృదయమందు
అన్నింటి పైన అధికారముంచితివి నీదు మేలులందు  || 2 ||  || నీవే నా ||

పరుగులోన వెనుదిరిగి  మరల నె చేరుకుంటి మొదలు
మారిపోక ఉత్తేజ పరిచితివి తెలిపి నీదు బదులు
ఎత్తి పట్టుకొని మోకరించగా నీదు వాగ్దానములు
తీరిపోయెను భారమయినట్టి మనసులోన దిగులు  || 2 ||  || నీవే నా ||