గడిచిన కాలమంతా నను నడిపిన నా దేవా
నీకంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా || 2 ||
మరో యెడు నాకొసగినందుకు! నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు! నిన్నేమని కీర్తింతును || 2 || || గడిచిన ||
ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు
శూన్యమందయిన సకలం సాధ్య పరచెదవు || 2 ||
నామేలు కోరి నీ ప్రేమతో నను దండించితివి
చేలరేగుతున్న డంబములు నిర్మూల పరచితివి || 2 || || మరో యెడు ||
నాదు కష్ట కాలములోన కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా || 2 ||
నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి
నీ ప్రేమతో నను పోషించి సత్తువ నింపితివి || 2 || || మరో యెడు ||