Gospel Songs Ministry

5, జులై 2022, మంగళవారం

చల్లని స్వరమే

 
చల్లని స్వరమే మెల్లగా పలికెను
తన సన్నిధిలో జోలలు పాడెను || 2 ||
లాలి లాలి యేసు ఒడిలో లాలి
దూతల స్తోత్రవళి నిదురలో నినుఁచాలి || 2 || || చల్లని స్వరమే ||

మా నవ్వుల పంట! దేవుని వరమే నీవు
ప్రార్థన ఫలితంగా మా బ్రతుకులో పండావు || 2 ||
నిదురలో కలల అలలపై తెలిపోతున్నావా
కను రెప్పలపై ఎగిరి ప్రభుతో ఆటలాడుతున్నావా || 2 || || లాలి లాలి ||

ప్రభు పనిలోన పాత్రగా నువ్వు వెలగాలి
తన ప్రేమను చాటే సాక్ష్యములను పొందాలి || 2 ||
అలసట కరుగులాగా ఆదమరచి నిదురపో
ప్రభు దయతో నువ్వెదిగి తనతో అలుపెరుగక సాగిపో || 2 || || లాలి లాలి ||