Gospel Songs Ministry

24, జనవరి 2019, గురువారం

నీ సన్నిధియే నా ఆశ్రయం



నీ సన్నిధియే నా ఆశ్రయం
నీ నామమే నా ఆధారం ॥ 2 ॥
స్తోత్రింతును, నిన్ను మరువను
నీ వాక్యమే నా దీపము ॥ 2 ॥
హల్లెలూయా, హల్లెలూయా ॥ 2 ॥

చీకటి లోన నే  సాగితిని
పాపనికి రూపముగా నే  మారితిని ॥ 2 ॥
అంతులేని వాంఛలతో అంధురాలనయితి
సాతానుకు ప్రియమయిన బంధువునయితి ॥ 2 ॥
నీ వెలుగుతో నను  నింపితివి
నీ రక్తముతో  నను కడిగితివి  ॥ 2 ॥ ॥ హల్లెలూయా ॥

 నీ నామము పలికే  అర్హత లేదు
నీ ప్రేమను పొందే యోగ్యత లేదు ॥ 2 ॥
నా భారము మోసి నను కాచితివి
శోధనలన్నింటి లోన కాపాడితివి ॥ 2 ॥
నిను పొగడక బ్రతుకుట ఎలా?
నిను వదిలి నేను అడుగిడ జాల ॥ 2 ॥ ॥ హల్లెలూయా ॥

20, జనవరి 2019, ఆదివారం

యేసు రాక తరుణ మాయే



యేసు రాక తరుణ మాయే
నీవు సిద్దమా !  సోదర!
ఆ పవిత్రుని చేరుటకు
అర్హురాలివా?  సోదరి! || 2 ||

తలుపు కొట్టి పిలిచినప్పుడు
పలుకుటకు నీకు సాధ్యమా!
తండ్రి రాజ్యం చేరుటకు
ఇదియే తరుణం ఓ సంఘమా  || 2 ||

పగిలిన నీ హృదయమయిన
వదలకుండా చేర్చుకోనును
విరిగిన నీ మనసునయిన
విడువకుండా అదుకోనును ॥ 2 ॥
నీదు పాపం కొండ అయిన
నిండుగా క్షమియించు వాడు
నీదు గిన్నె పొంగులాగ
అవసరాలు తిర్చుతాడు  ॥ 2 ॥  ॥ యేసు రాక ॥

కాయు కాలము కాదు అంటూ
మోడుగను నివు ఉండబోకు
ఆకలి గొన్న ప్రభు యేసు
శాపములను పొందబోకు  ॥ 2 ॥
తైలము లెని దిపము తోని
పెళ్ళి మెళమును చేరుకోకు
కాలమంతయు ఖర్చు చేసి
అన్యుల గుంపులో కలిసిపోకు ॥ 2 ॥   ॥ యేసు రాక ॥

15, జనవరి 2019, మంగళవారం

భయము లేదు మనకు



భయము లేదు మనకు, ఇకపై
ఎదురు వచ్చుఁ గెలుపు 
అదిగో యేసు పిలుపు, వినుమా 
పరము చేరు వరకు  

ఫలితమేదయిన  ప్రభును  వీడకు  
కష్టమెంతయినా కలత చెందకు 
అలుపు లేకుండా  పరుగు సాగని 
శోధనలు నిన్ను చూసి  బెదరని  ||  భయము || 

సంధించిన బాణమల్లె  నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్దనాలే ఊపిరిగా మారని || 2 ||
కష్టలే మెట్లుగా మారి యేసులో  ఎదిగించని
తన వాక్యం  నీలో వెలిగి  చీకటి తొలగించని   || 2 ||  || ఫలిత ||

మండించే అగ్గితోనే మెరుయును  బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము  || 2 ||
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ  మార్గన్నీ  తన ఆజ్ఞను వినకుండా || 2 ||  || ఫలిత ||

కనలేదా సిలువలోన యేసురాజు  కష్టము
తానొందినా శ్రమల ద్వారా నశియించే  పాపమూ  || 2 ||
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము  నశియించాలి  || 2 ||  || ఫలిత ||

ప్రియమయిన  పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడ?  సకలం,  సర్వశక్తిమంతుడు   || 2 ||
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు  || 2 ||  || ఫలిత ||