Gospel Songs Ministry

29, అక్టోబర్ 2021, శుక్రవారం

అందాల బాలుడు


అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు  || 2 || 
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను 
ప్రేమను పంచెట్టి రక్షణను తెచ్చెను  || 2 ||  || అందాల || 

భీతిల్లి పోయాము అ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునె గాంచి || 2 || 
గొల్లలము మేము కల్లలు ఎరుగము || 2 || 
కళ్లారా జూసాము తేజోమాయుని మోము || 2 ||   || రండయ్యో || 

తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము || 2 || 
దారి చూపే తార రారాజునె-జేర || 2 || 
మొక్కము మోఁకఱిల్లి బాలుణ్ణి మనసారా || 2 ||  || రండయ్యో ||

తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసెయు రక్షకుడు  || 2 || 
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు || 2 || 
నీ తప్పులెన్ని ఉన్న మన్నించుతాడు రేడు || 2 ||  || రండయ్యో ||