అదిగదిగో యేసు లేచేను
కని విని ఎరుగని వింత జరిగెను
నమ్మిన వారికి కలదు రక్షణ
పరమును చేరే ఆ నిరీక్షణ || 2 ||
బ్రద్దలయిన సమాధి సాక్షిగా
యేసు రాజు మరణము గెలిచేగా
ఆదిలోనా పుట్టిన పాపమూ
గెలుచుటకు చూపించెను మార్గము || అదిగదిగో ||
ప్రతి ఒక హృదయం వెలుగు నిండాలి
సువార్త ఫలములు బహుగా పండాలి || 2 ||
ప్రతి ఒక నాలుక తనని వేడాలి
సృష్టికి ప్రభువని ఒప్పుకోవాలి || బ్రద్దలయిన ||
మరియొక మారు వచ్ఛు చున్నాడు
తన తీర్పులను తెచ్చు చున్నాడు || 2 ||
సమయం లేదు ఎరుగు సంఘమా
ప్రభువును నమ్మి పరము చేరుమా || బ్రద్దలయిన ||