ఇద్దరొక్కటిగా మారేటి మధురమయిన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము || 2 || వివాహమన్నది అన్నింటా ఘనమయినది ఆదాము హవ్వలతో మొదలయింది అసందడి || 2 || ఒంటరయిన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి || 2 || హవ్వను చేసి జతపరచి, ఫలించమని దీవించెను సృష్టి పైన అధికారముతో, పాలించుమని నియమించెను || 2 || || వివాహమన్నది || ఏక మనసుతో ముందుకు సాగి
జీవ వృక్షముకు మార్గము ఎరిగి || 2 || సొంత తెలివిని మానుకొని, దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం, దేవుని కొరకై ప్రతి క్షణం || 2 || || వివాహమన్నది || భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరనుకుంటూ || 2 || క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చెర్చాలి || 2 || || వివాహమన్నది ||