Gospel Songs Ministry

2, మే 2020, శనివారం

అమ్మ నీ ఋణమునుదేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం
"అమ్మ" అంటూ పిలుచుకొని పొందుకొనేను జన్మం
నీకంటూ  ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం
కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం || 2 ||

"అమ్మ" నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో
ఆ దైవము సైతము నేర్చే పాఠాలు చల్లని నీ ఒడిలో  || 2 ||  || దేవుడే ||

కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం
తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం  || 2 ||
మోషేగా మారిన అపసివాడిని,  దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం  || "అమ్మ" ||

సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం
దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను  మాతృత్వం || 2 ||
హాన్న చేసిన ఆ త్యాగమే కాదా? సమూయేలు పొందిన న్యాయాధిపత్యము || "అమ్మ" ||

కోన ఊపిరితో సిలువపైన వేలాడుతున్నా క్షణము
ఆ దేవా దేవుడు తీర్చుకొనెను తన  మాతృమూర్తి ఋణము || 2 ||
ప్రియా శిష్యుని దరికి తల్లిని చేర్చి నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం || "అమ్మ" || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి