మోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు || 2 ||
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు (2)
కడలి పై నడిచిన పాదాలు! సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు! సిలువలో శిలలతో వ్రేలాడే || 2 ||
ఇంత ఘోరము, మోపిన నేరము
నేను చేసిన పాప భారము || 2 || || మోయలేని ||
జయము నీకని పలికిన జనము మహిమ ఏదని? నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి || 2 ||
తాకినంతనే, మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము || 2 || || మోయలేని ||
దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చెర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తిర్చిరి || 2 ||
ఇంత జరిగిన, ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ || 2 || || మోయలేని ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి