బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన రారాజు
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినాడు
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నాడు
మనల చేర్చాలని తన
కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు || బంగారము ||
తప్పుల అప్పుకు హద్దులు లేక
బ్రతుకు భారమవుతుంటే
తప్పులు మన్నించి బరువు
దించమని తననే వేడుకుంటే || 2 ||
క్షణ కాలమైన ఆలోచించక
తప్పులు మన్నించుతాడు
మన శిక్షనంత చెల్లించటానికి
పరము నుండి వచ్చినాడు || 2 || || బంగారము ||
పాపము నిండిన హృదములోన
నీతి నింప వచ్చినాడు
తనకెంత దూరము మనము వెళ్ళిన
ప్రేమనంత పంచుతాడు || 2 ||
పాపపు బానిస జనమును పిలిచి
స్నేహము అందించుతాడు
మన దోషమంత రద్దు చేయుటకు
రారాజు బంటు అయినాడు
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన యేసయ్య
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినవయ్యా
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నావు
మమ్ము చేర్చాలని నీ
కొలువు లోనికి రాజ్యమునే విడిచావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి