Gospel Songs Ministry

14, ఆగస్టు 2020, శుక్రవారం

సువార్త మోసిన పాదములు



సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు, ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు || 2 ||
ఏ లేమికి కలత చెందరు, ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు, తన చిత్తము ఎరిగిన వారు || 2 ||

యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు || 2 ||
తమ సిలువను ఎత్తుకొని, ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి,  తన  సన్నిధినె చేరారు  || 2 ||  || ఏ లేమికి కలత ||

లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు || 2 ||
తమ దేహము యాగముగా, శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని, ప్రభు రక్షణను పంచారు || 2 ||  || ఏ లేమికి కలత ||