Gospel Songs Ministry

20, ఏప్రిల్ 2019, శనివారం

అదిగదిగో యేసు లేచేను



అదిగదిగో  యేసు లేచేను
కని విని ఎరుగని వింత జరిగెను
నమ్మిన వారికి కలదు రక్షణ
పరమును చేరే  ఆ  నిరీక్షణ  || 2 ||

బ్రద్దలయిన సమాధి సాక్షిగా
యేసు రాజు మరణము గెలిచేగా
ఆదిలోనా పుట్టిన పాపమూ
గెలుచుటకు చూపించెను మార్గము  || అదిగదిగో ||

ప్రతి ఒక హృదయం వెలుగు నిండాలి
సువార్త ఫలములు బహుగా  పండాలి || 2 ||
ప్రతి ఒక నాలుక తనని  వేడాలి
సృష్టికి ప్రభువని ఒప్పుకోవాలి  || బ్రద్దలయిన ||

మరియొక మారు వచ్ఛు చున్నాడు
తన తీర్పులను తెచ్చు చున్నాడు  || 2 ||
సమయం లేదు ఎరుగు సంఘమా
ప్రభువును  నమ్మి పరము చేరుమా || బ్రద్దలయిన ||

17, ఏప్రిల్ 2019, బుధవారం

తిరిగి లేచాడు



తిరిగి లేచాడు శ్రీ యేసు నాథుండు
మరణమును  గెలిచి మన నిత్య జీవముకై
దైవ తనయుడు సిలువలో కార్చి రక్తమును
నీదు నాదు ఘోర పాపము పారద్రోలెను

హల్లెలుయా హల్లెలుయా
హల్లెలుయా అని పాడెదం
అంతులేని సంభరముతో
నింగి దాక ఉప్పొంగేదం

అర్హతే  లేని హీన జనులము అయిన
తండ్రి రాజ్యముకు మనలన్ పౌరులను చేసే
పాప క్రియలను సిలువలో నిలువరించేను
లోకమును  కాచే కాపరి అవతరించేను  ॥ 2 ॥ ॥ హల్లెలుయా ॥

నీతిని నిలిపి ప్రభువు పరముకేగాడు
తండ్రి కుడి వైపు తానూ కొలువు తిరాడు
నీవే దిక్కంటూ తండ్రిని వేడుకుందాము
వదలిపోని ఆ రక్షణను పొందుకుందాము ॥ 2 ॥  ॥ హల్లెలుయా ॥

పాపములో మరణం తిరిగి  యేసులో జననం
రాదు ఈ తరుణం వలదు కాలయాపనం
శోధనను గెలిచే వెలుగు మనకు ఆభరణం
శాంతి, సమాధానం మనకు దొరికే బహుమానం ॥ 2 ॥ ॥ హల్లెలుయా ॥

మరణము పొంది పరములో మరల  బ్రతికేదము
తండ్రి, తనయునితో కూడి కొలువు తిరెదము
దేవ దూతలకే మేము తీర్పు తిర్చేదము
సూర్యుడే లేని లోకంలో  వెలుగు పొందెదం ॥ 2 ॥ ॥ హల్లెలుయా ॥

9, ఏప్రిల్ 2019, మంగళవారం

షాలోము రాజుకు



షాలోము రాజుకు వందనం
సీయోను పాటలు పాడెదాం  || 2 ||
యేసు రాజ వందనం
మహిమ రాజ వందనం
మృత్యుంజయుడా వందనం
ముక్తి దాత వందనం   || షాలోము  ||

ఖాళీ అయినా సమాధి చూసి, చావు పరుగులు తీసెను అలసి
పాపమొందిన ఓటమి తెలిసి,  పారి పోయెను అపవాది జడిసి  || 2 ||  || యేసు రాజ ||

మొదటి ఆదాము చేసిన పాపం, మానవులపై తెచ్చెను మరణం
కనికరముతో కడపటి ఆదాము, గెలిచి మరణము తెచ్చెను జీవం   || 2 ||  || యేసు రాజ ||

మనుష్యుడాదిలో  పొందిన శాపం, నరకముకు తరలించె తరుణం
దైవ వాక్యము మనిషిగా మారి,  నమ్మినంతనే పరము చేర్చే వైనం  || 2 ||  || యేసు రాజ ||

4, ఏప్రిల్ 2019, గురువారం

సిలువలో నీ ప్రేమ



బృందం (కోరస్):   ఆదియందు వాక్యమయి ఉన్న దేవా
నా విముక్తికై పరమును విడినావా!
సృష్టి కారుడవు మరణము పొందినావా
నిత్య జీవముతో నన్ను దీవించినవా

సిలువలో నీ ప్రేమ ! పాపమూ తిసేనయ్యా
మరణము చెరలో నుండి -  నన్ను విడిపించేనయ్యా  || 2 ||
ఘోర పాపిని నేను - పరిశుద్ధుని చేసితివి
నిత్య జీవములో  నన్ను - నిలుపుటకు బలి అయితివి || 2 ||

తాళలేని నీ తాపం  - తొలగించేను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం - ఇచ్చేను నాకు స్వరూపం || 2 ||
నను విడిపించుటకు - విలువను విడిచితివి
పరమును చేర్చుటకు - మహిమను మరిచితివి || 2 ||  || సిలువలో నీ ప్రేమ ||

దైవ తనయుని దేహం - మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం - చిందించే నిలువునా రుధిరం || 2 ||
నను కాపాడుటకు - రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు - బలిగా మారితివి || 2 ||  || సిలువలో నీ ప్రేమ ||

బృందం (కోరస్):   ఆదియందు వాక్యమయి ఉన్న దేవా
నా విముక్తికై పరమును విడినావా!
సృష్టి కారుడవు మరణము పొందినావా
నిత్య జీవముతో నన్ను దీవించినవా

అధముడయినట్టి నేను - నీ ప్రేమకు  అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము - తీర్చగలేను నీ ఋణము || 2 ||
నిను చాటించుటకు - వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై  - ఉప్పుగా నిలిచెదను || 2 ||  || సిలువలో నీ ప్రేమ ||

నెన, నేనా!



నెన,  నేనా! నీ శ్రమల కారణము
నా పాప క్రియల  ఆ సిలువలో నీ ఋణము 
ఎంతటి ఆదరణ  అంతులేని కరుణ 
ఆశ్చర్యం అ ప్రేమ  హద్దులేదు నీ క్షమ  ॥ నెన ॥ 

నువ్వు పొందిన అ దూషణ నా దోషము కదా!
నాదు లోకకేళి   నీ పాలిట ఎగతాళి   ॥ 2 ॥ 
నా పాప తలపులే  అయ్యెను ముళ్ళ కిరీటం   
నా దొంగ నటనలే  చేసెను నీకు గాయముల్   ॥ 2 ॥  ॥ నెన ॥ 

నువు మోసిన ఆ సిలువ నాదు పాపమెగా! 
నా చెడ్డ మాటలే  మారాయి కోరడగా  ॥ 2 ॥ 
నా మలిన మనసుకు  ఆవసరమయి నిదు రక్తము 
కలువరిలో పొందితివా యిన్ని కష్టముల్  ॥ 2 ॥ ॥ నెన ॥ 

పాపమన్నదే ఎరుగని పావన మూర్తివిగా 
నిదు నీతి భోధలే తిర్చాయి లోక బాధలు ॥ 2 ॥
మరణమునే గెల్చిన ఓ దైవ పుత్రుడా
సాగెద  సదా కాలం నీతో సజీవుడా  ॥ 2 ॥ ।। నెన ॥