Gospel Songs Ministry

28, నవంబర్ 2019, గురువారం

తార వెలిసెనుతార వెలిసెను ఈ వేళ
యేసు పుట్టిన శుభవేళ  || 2||
వెలిగెను ఈ లోకం, మదిలో నిండెను ఆనందం
తరగని రక్షణను మనకై తెచ్చెను ఆ దైవం || 2||
రండి వార్తను చాటుదాము
ఆ రక్షణను పంచుదాము  || 2 ||  || తార ||

పశుల పాకె పావనమాయే
మంద గొల్లలే తన వారయే  || 2||
జ్ఞానులొచ్చిరి ఆరాధింప
రాజులలో భీతిని నింప  || 2 ||  || తార ||

పాపమెరుగని నీతి పరుడు
లోకమును కాచే రక్షకుడు || 2 ||
కన్య మరియా గర్భమున
పుట్టెను దేవుని అంశమున || 2 || || తార ||

రాజులకు రాజయిన తనకు
ఇచ్చుటకు ఏమున్నది మనకు || 2 ||
వెండి బంగారముల కన్నా
హృదములనర్పిస్తే మిన్నా || 2 ||  || తార ||

15, నవంబర్ 2019, శుక్రవారం

అంబరాన్ని దాటే


అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు || 2 ||
రండయ్యో రండి రండి దావీదు పురముకు || 2 ||
రారాజు పుట్టి ఇలా పిలిచెను కొలువుకు || 2 ||

దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని  పంపెను ఈ దినము  || 2 ||
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా  || 2 ||
అవతరించే నేడు లోక రక్షకునిగా || 2 ||  || రండయ్యో ||

దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు, పాపాలు రద్దయిన శుభవేళ  || 2 ||
లోకాల  కారకుడు లోకమున పుట్టెను || 2 ||
మనిషి మరణము ఆయువు తీరెను  || 2 ||  ||  రండయ్యో ||