నీవేగా మాకై బలి అయినది
మరణమును సైతం గెలిచినది || 2 ||
యాజకుడిగా ! త్యాగము చేసి
కాచితివి మము సిలువను మోసి || 2 ||
యాజకుడ ! మా యాజకుడా, నీవె దిక్కు రక్షకుడా || 2 ||
దైవ జనులకు సాధ్యము కానీ
తరతరములకు ఎన్నడు తరగని || 2 ||
నీదు రక్షణ మా కొసగితివి
నిత్య జీవములో నిలిపితివి || 2 || || యాజకుడ ||
భువిని చేరిన ఓ దైవ సుతుడా
నీవే మార్గము అతి పరిశుద్ధుడా || 2 ||
తెలుపు తండ్రికి మా ప్రార్థనలు
కుమ్మరించుము తన దివేనలు || 2 || || యాజకుడ ||
నరునిగా మారి ఇల తిరిగి
మాదు శోధనలన్నియు ఎరిగి || 2 ||
నీతి నిలిపితివి చిరకాలము
గెలిచి మరణము, చేరి పరము || 2 || || యాజకుడ ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి