భయము లేదు మనకు, ఇకపై
ఎదురు వచ్చుఁ గెలుపు
అదిగో యేసు పిలుపు, వినుమా
పరము చేరు వరకు
ఫలితమేదయిన ప్రభును వీడకు
కష్టమెంతయినా కలత చెందకు
అలుపు లేకుండా పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని || భయము ||
సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్దనాలే ఊపిరిగా మారని || 2 ||
కష్టలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని || 2 || || ఫలిత ||
మండించే అగ్గితోనే మెరుయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము || 2 ||
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా || 2 || || ఫలిత ||
కనలేదా సిలువలోన యేసురాజు కష్టము
తానొందినా శ్రమల ద్వారా నశియించే పాపమూ || 2 ||
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి || 2 || || ఫలిత ||
ప్రియమయిన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడ? సకలం, సర్వశక్తిమంతుడు || 2 ||
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు || 2 || || ఫలిత ||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి