Gospel Songs Ministry

22, అక్టోబర్ 2020, గురువారం

దేవా ఇలలోన నీవు


దేవా ఇలలోన  నీవు మాకిచ్చిన గృహము
మా తోడుగా కొలువుండే నీదు ఆలయము || 2 ||
మా యజమానివి నీవై మమ్ములను నడిపించు
నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు || 2 ||
వందనములు  అందుకో మా యేసయ్య
కలకాలం నీ కాపుదలే కావలయ్యా || 2 ||  || దేవా ఇలలో ||

నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమయిన లేదయ్యా
పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్య  || 2 ||
ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్య
నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావ || వందనములు ||

నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ 
నీ నీడలో మె సాగుటకు మా గృహమును కట్టుమయ   || 2 ||
శోధన, వేదనలేదిరించే బలమును అందించుమయ్య
నీ కృపలను చాటించెటి సాక్షములతో నింపుమయ్య || వందనములు ||

నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మెముండాలి
నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి || 2 ||
సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి
కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి || వందనములు ||