ఎంతెంత భారమాయే ఆ సిలువా
లోక పాపములన్ని నువ్వు గెలువా ॥ 2 ॥
కదిలావు - ఆ కల్వరికి
మరణాన్ని నీ దరి చేర్చుకుని ॥ 2 ॥
యెసయ్య - నా యెసయ్య
అలసి పోతివా - నా కోసమే
యెసయ్య - నా యెసయ్య
నలిగి పోతివా - నా కోసమే
కొరడాలు నీ ఒళ్ళు చిల్చెను
పిడి గుద్దులతొ కళ్ళు తిరిగెను ॥ 2 ॥
వాడి ముళ్ళు తలలోన నాటెను
నీ కళ్ళు రుదిరాన్ని కురిసెను ॥ 2 ॥ ॥ యెసయ్య ॥
బరువయిన సిలువను మోయలేక
తడబడె నీ అడుగు అదుపులేక ॥ 2 ॥
వడి వడి గా నిన్ను నడువుమని
పడి పడి తన్నిరి ఆ పాపులు ॥ 2 ॥ ॥ యెసయ్య ॥
చల్లని నీ దేహమాల్లడెను
ఏ చోటు లేకుండా గాయాలతో ॥ 2 ॥
కాళ్ళు చేతులలో దిగి మేకులు
వేలాడే సిలువకు నీ ప్రాణము ॥ 2 ॥ ॥ యెసయ్య ॥
వెలలేనిది తండ్రి నీ త్యాగము
నీ కష్టమంతయు నా పాపము ॥ 2 ॥
మదిలోన కొలువుండు నా రక్షక
వదిలేది లేదు నిన్ను నా ఏలిక ॥ 2 ॥ ॥ యెసయ్య ॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి