ఎన్నడూ ఎన్నడూ నిన్ను విడిపోనయ్యా
ఉన్నపాటుగా నన్ను హత్తుకునే నీ దయా || 2 ||
మరువనంటివి! నీవు మారనంటివి || 2 ||
కరుణ చూపి! నీ వెలుగులో నడుపుచుంటివి || 2 || || ఎన్నడూ ఎన్నడూ ||
తల్లి తండ్రి విడిచిన, బంధువులే మరచిన
లోకము నను వెలివేసి దుర్బలుడని పిలిచిన || 2 ||
కొండ వంటి అండ నీవు నాకు ఉండగా
పండగేగా ప్రతిదినము నీతో సాగుతుండగా || 2 || || ఎన్నడూ ఎన్నడూ ||
నెనేనాడో ఎరిగితిని నాది ఏమి లేదని
ఏదయినా సాధించిన అది నీదు దీవేనని || 2 ||
ఎన్ని మారులో నేను సిలువ నిన్ను వేసిన
ఎందుకనో నాపైన కురిసే నీదు దీవెన || 2 || || ఎన్నడూ ఎన్నడూ ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి