నీ సన్నిధియే నా ఆశ్రయం
నీ నామమే నా ఆధారం ॥ 2 ॥
స్తోత్రింతును, నిన్ను మరువను
నీ వాక్యమే నా దీపము ॥ 2 ॥
హల్లెలూయా, హల్లెలూయా ॥ 2 ॥
చీకటి లోన నే సాగితిని
పాపనికి రూపముగా నే మారితిని ॥ 2 ॥
అంతులేని వాంఛలతో అంధురాలనయితి
సాతానుకు ప్రియమయిన బంధువునయితి ॥ 2 ॥
నీ వెలుగుతో నను నింపితివి
నీ రక్తముతో నను కడిగితివి ॥ 2 ॥ ॥ హల్లెలూయా ॥
నీ నామము పలికే అర్హత లేదు
నీ ప్రేమను పొందే యోగ్యత లేదు ॥ 2 ॥
నా భారము మోసి నను కాచితివి
శోధనలన్నింటి లోన కాపాడితివి ॥ 2 ॥
నిను పొగడక బ్రతుకుట ఎలా?
నిను వదిలి నేను అడుగిడ జాల ॥ 2 ॥ ॥ హల్లెలూయా ॥