Gospel Songs Ministry

29, మార్చి 2019, శుక్రవారం

మోయలేని భారమంతమోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు  || 2 ||

అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు (2)

కడలి పై నడిచిన పాదాలు! సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు! సిలువలో శిలలతో వ్రేలాడే  || 2 ||
ఇంత ఘోరము, మోపిన నేరము
నేను చేసిన పాప భారము || 2 ||  || మోయలేని ||

జయము నీకని పలికిన జనము మహిమ ఏదని? నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి || 2 ||
తాకినంతనే, మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము  || 2 ||  || మోయలేని ||

దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చెర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తిర్చిరి  || 2 ||
ఇంత జరిగిన, ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ  || 2 ||   || మోయలేని ||

24, మార్చి 2019, ఆదివారం

ఎంతెంత భారమాయేఎంతెంత భారమాయే ఆ సిలువా
లోక పాపములన్ని నువ్వు గెలువా  ॥ 2 ॥
కదిలావు - ఆ కల్వరికి
మరణాన్ని నీ దరి చేర్చుకుని ॥ 2 ॥

యెసయ్య - నా యెసయ్య
అలసి పోతివా - నా కోసమే
యెసయ్య - నా యెసయ్య
నలిగి పోతివా - నా కోసమే

కొరడాలు నీ ఒళ్ళు చిల్చెను
పిడి గుద్దులతొ కళ్ళు తిరిగెను ॥ 2 ॥
వాడి ముళ్ళు తలలోన నాటెను
నీ కళ్ళు రుదిరాన్ని కురిసెను ॥ 2 ॥  ॥ యెసయ్య ॥

బరువయిన సిలువను మోయలేక
తడబడె నీ అడుగు అదుపులేక ॥ 2 ॥
వడి వడి గా నిన్ను నడువుమని
పడి పడి తన్నిరి ఆ పాపులు ॥ 2 ॥  ॥ యెసయ్య ॥

చల్లని నీ దేహమాల్లడెను
ఏ చోటు లేకుండా గాయాలతో ॥ 2 ॥
కాళ్ళు చేతులలో దిగి మేకులు
వేలాడే సిలువకు నీ ప్రాణము ॥ 2 ॥ ॥ యెసయ్య ॥

వెలలేనిది తండ్రి నీ త్యాగము
నీ కష్టమంతయు నా పాపము ॥ 2 ॥
మదిలోన కొలువుండు నా రక్షక
వదిలేది లేదు నిన్ను నా ఏలిక  ॥ 2 ॥ ॥ యెసయ్య ॥

18, మార్చి 2019, సోమవారం

నా పాపమే నినునా పాపమే నిను లోకము చేర్చేను
నా దోషమే నిను సిలువను వెసేను  || 2 || 
నేనే గా పెంచితి నీ భారం! తండ్రికి నిను చెసితిని దూరం || 2 ||  || నా పాపమే ||

ఆ గెత్సేమనే వనము లోన నువ్వు చేసిన ఆ ప్రార్థనలో
నీ రుధిరము స్వేదము బిందువులుగా మారి ఎడతెగకుండా కురిసిన || 2 ||
నువ్వు నలుగుట తండ్రి కోరెను! నా పాపము నీపై మోపెను  || 2 ||
నువ్వు చూపిన వినయమే కాదా? నా పాలిట వెలకట్టని క్రయధనముగ మారెను  || నా పాపమే ||

ఆ సిలువలో, నీ బాధలలో చూచితిని నా పాపము
నీ ప్రేమతో కార్చిన రుధిరం చెల్లించేను  నా మూల్యము  || 2 ||
ఈ మరణము నాకోసమే! నీ యాతన నా లోపమే || 2 ||
ఏమున్నది నాలోన ఘనము! నీ ప్రాణము పెట్టి నన్ను చేర్చితివి పరము  || నా పాపమే ||

12, మార్చి 2019, మంగళవారం

మరువనంటివి!ఎన్నడూ ఎన్నడూ నిన్ను విడిపోనయ్యా
ఉన్నపాటుగా నన్ను హత్తుకునే నీ దయా  || 2 ||
మరువనంటివి! నీవు మారనంటివి || 2 ||
కరుణ చూపి! నీ వెలుగులో నడుపుచుంటివి || 2 ||  || ఎన్నడూ ఎన్నడూ ||

తల్లి తండ్రి విడిచిన, బంధువులే మరచిన
లోకము నను వెలివేసి దుర్బలుడని పిలిచిన  || 2 ||
కొండ వంటి అండ నీవు నాకు ఉండగా
పండగేగా ప్రతిదినము నీతో సాగుతుండగా  || 2 ||  || ఎన్నడూ ఎన్నడూ ||

నెనేనాడో ఎరిగితిని నాది ఏమి లేదని
ఏదయినా సాధించిన అది నీదు దీవేనని  || 2 ||
ఎన్ని మారులో నేను సిలువ నిన్ను వేసిన
ఎందుకనో నాపైన కురిసే నీదు దీవెన  || 2 ||  || ఎన్నడూ ఎన్నడూ ||