కొంత యెడము నీవయినా నే సాగలేను
నిమిషమయిన నిన్ను విడిచి నే బ్రతుక లేను
నిమిషమయిన నిన్ను విడిచి నే బ్రతుక లేను
కొంత యెడము నీవయినా
మరచిన వేళలో మది నీ పలుకులు
సడలి కట్టడలు మలినము తలపులు || 2 ||
ప్రేమను పంచే ప్రేమ రూపుడా || 2 ||
మరియొక్క మారు మన్నించు విభుడా || 2 || || కొంత యెడము ||
కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము || 2 ||
కమ్మిన పొరలు కరిగించుటకు || 2 ||
నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు || 2 || || కొంత యెడము ||
మదము, మత్సరములు సోకిన తరుణము
పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము || 2 ||
నిరతము స్తిరముఁగ నున్న అక్షయుడా || 2 ||
నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా || 2 || || కొంత యెడము ||
మనుజ రూపమున మహిలో నిలిచి
మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి || 2 ||
నను వరియించగ రానున్న ప్రియుడా || 2 ||
నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా || 2 || || కొంత యెడము ||
నా యేసయ్య - కొంత యెడము నీవయినా