Gospel Songs Ministry

28, ఫిబ్రవరి 2019, గురువారం

కంట నీరేలా? కలతలు ఎలా?



కంట నీరేలా? కలతలు ఎలా? యేసుతో ! నీవు సాగు వేళ శోధన వేళ ! రోదన ఎలా? నీ విశ్వసము! గెలిచే వేళ నమ్మిన ఆ దేవుడు - ఎన్నడూ నిను మరువడు నీయొక్క అవసరలు - ఏనాడో తానెరిగాడు || 2 || వలదు చింతన దేనికయినా విన్నవించుము నీ నివేదన || 2 || పొందితినను నీదు నమ్మకం - దరికి చేర్చు తగిన విజయము తిరుగన్నదే లేనివి - ఆ తండ్రి దీవెనలు || 2 || పొరపాటు ఎరుగనివి - తానిచ్చు ఆ మేలులు || 2 || || కంట || రేపు గూర్చిన భయము వలదు ప్రతి దినము తగు భాధ కలదు || 2 || నీ భారము మోయు దేవుడు - నీ ముందుగా నడుచు ఎప్పుడు నీలోన ఉన్న భయము - లోకానికి ప్రతి రూపము || 2 || స్థిరమయిన విశ్వాసం - దేవునికి ఆనందము || 2 || || కంట ||

20, ఫిబ్రవరి 2019, బుధవారం

తిరిగి పాపం చేసెదవా?



దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)

ఎంత అధము  ఆ సౌలు కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న
వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో  మన్నా ॥ 2॥

మరచినవా నీ అపజయములు - గురుతు  లేదా! ఆ శోధనలు
నీవు చూపిన ఆ వినయములు - ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు || 2 || 
తండ్రి నీవే దిక్కంటూ,  మోకరిల్లిన ఆ క్షణము
అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు ॥ 2॥  ॥ ఎంత ॥

పొందు కొంటివి బాప్తిస్మమును - అందుకొంటివి ఆ రక్షణను
వదలబోకు ఆత్మీయతను - చేరనివ్వకు నిర్లక్ష్యమును || 2 || 
తీర్పు తీర్చే సమయంలో, ఓర్పు దొరకదు గుర్తెరుగు
నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా? ॥ 2 ॥  ॥ ఎంత ॥

దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా!

17, ఫిబ్రవరి 2019, ఆదివారం

నీ దేహమే తండ్రి ఆలయం



నీ దేహమే తండ్రి ఆలయం, కాదు కనపడే ఆ భవనం
యేసు రాజు నిత్య ప్రేమతో, మారిపోయెను నీ గతం || 2 ||
వద్దు వద్దు వద్దు తొంగి చూడవద్దు - సాతానుకు మళ్ళి లొంగిపోవద్దు
నీతి నీలో ఉంటె ఆకాశమే హద్దు - దివ్య వాక్కులతో శోధనలు రద్దు  || 2 ||  ||  నీ దేహమే ||

అలనాడు ఆ యోసేపు పాటించిన నిగ్రహము
ఆ యోబు కలతను మాని కనబరచిన నిబ్బరము  || 2 ||
నీకు సాధ్యమే సత్యములో,  పడబోకు లోకము వలలో
తలచు యేసు నామం మదిలో,  తిరిగి రాదు పాపం నీలో  || 2 ||  || వద్దు వద్దు వద్దు ||

దావీదు దేవుని మనసు ఎరిగిన వాడయినప్పటికి
ఎన్నెన్నో కోల్పోయెనుగా తను చేసిన తప్పు  దాటీకి || 2 ||
తెలిసి చేయు పాప భారము, కలిగించును గొప్ప నేరము
పారిపోవ తగిన దూరము, ఆలకించు దేవుని స్వరము || 2 ||  || వద్దు వద్దు వద్దు ||

పౌలు అయినా సౌలు జీవితం కావాలి నీకు పాఠము
లక్ష్యము  మరచిన సంసోను నేర్పాలి గుణపాఠము  || 2 ||
నులి వెచ్చని బ్రతుకులోన,  ఏ ఫలితము కానరాదు
దేవుని ప్రేమంటే అర్థం, పరిశుద్ధత మరచుట కాదు  || 2 ||  || వద్దు వద్దు వద్దు ||

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

యాజకుడ మా యాజకుడా



నీవేగా మాకై బలి అయినది
మరణమును సైతం గెలిచినది   || 2 ||
యాజకుడిగా ! త్యాగము చేసి
కాచితివి మము సిలువను మోసి || 2 ||
యాజకుడ ! మా యాజకుడా, నీవె దిక్కు రక్షకుడా  || 2 ||

దైవ జనులకు సాధ్యము కానీ
తరతరములకు ఎన్నడు  తరగని  || 2 ||
నీదు రక్షణ మా కొసగితివి
నిత్య జీవములో నిలిపితివి || 2 ||  || యాజకుడ ||

భువిని చేరిన ఓ దైవ సుతుడా
నీవే మార్గము అతి పరిశుద్ధుడా || 2 ||
తెలుపు తండ్రికి మా ప్రార్థనలు
కుమ్మరించుము తన దివేనలు  || 2 ||  || యాజకుడ ||

నరునిగా మారి ఇల తిరిగి
మాదు శోధనలన్నియు ఎరిగి || 2 ||
నీతి నిలిపితివి చిరకాలము
గెలిచి మరణము, చేరి పరము || 2 ||  || యాజకుడ ||