దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! || 2||
ఎంత అధము ఆ సౌలు కన్న, ఎంత ఘోరము ఆ యూదా కన్న
వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా || దేవుని గొప్ప ||
మరచినావా నీ అపజయములు - గురుతు లేదా! ఆ శోధనలు
నీవు చూపిన ఆ వినయములు - ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు || 2 ||
వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా || దేవుని గొప్ప ||
మరచినావా నీ అపజయములు - గురుతు లేదా! ఆ శోధనలు
నీవు చూపిన ఆ వినయములు - ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు || 2 ||
తండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణము
అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు || 2 || || ఎంత అధము ||
అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు || 2 || || ఎంత అధము ||
పొందు కొంటివి బాప్తిస్మమును - అందుకొంటివి ఆ రక్షణను
వదలబోకు ఆత్మీయతను - చేరనివ్వకు నిర్లక్ష్యమును || 2 ||
తీర్పు తీర్చే సమయములో, ఓర్పు దొరకదు గుర్తెరుగు
నిత్య జీవం లో నుండి, ఘోర నరకము చేరెదవా? || 2 || || ఎంత అధము ||
దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి