Gospel Songs Ministry

10, మే 2026, ఆదివారం

లాలి పాటలు పాడాలి!

 
లాలి లాలి అంటూ పాటలు పాడాలి ఆ దేవుని కార్యములు సాక్ష్యము చెప్పాలి ఈ గర్భ ఫలము ఆ దేవుని వరము మా సంతానము తనకే అంకితము
ఆనాడు హన్నా ప్రార్థన విన్న వాడు మాపై కూడా కృపను కురిపించినాడు || 2 || సమూయేలుగా మా సంతానమును పెంచాలి || 2 || ఎస్తేరు రుతులుగా వెలుగులో నడవాలి || 2 || || లాలి లాలి ||
ప్రతి ఆపద నుండి క్రీస్తును కాచిన దేవుడు నిను కూడా నిత్యమూ నడిపించును గాక || 2 || పౌలు మాదిరి ప్రభు కొరకు పరుగెట్టాలి || 2 || విశ్వాసములో ప్రభు మెప్పును నువు పొందాలి || 2 || || లాలి లాలి ||

22, జనవరి 2026, గురువారం

నన్ను మార్చుము దేవా

 

నన్ను మార్చుము దేవా, నన్ను మార్చుము ప్రభువా || 2 || 
నీ ఆజ్ఞలు మిరీతిని పాపమును చేరితిని
తనువు తపన తీర్చుటకు కపటమును నేర్చితిని || 2 ||  || నన్ను మార్చుము ||

పరిశుద్దతను విడిచి లోకములో పడిపోయితిని
పరలోకపు మార్గము మరచి నరకముకు నడిచితిని || 2 ||
నీ దండముతో సరిచేసి దయతో నీ దరికి చేర్చుము
జీవము గల నీ వాక్కులతో నాదు పాపములను చూపుము ||2 ||  || నన్ను మార్చుము ||

నీవు నాకు కాపరివైన కంచె దాటి పొయితి నేను
మంచి నాకు పంచిన గాని వంచనతో విడిచితి నిన్ను || 2 ||
నీ సన్నిధి విడిచిన మొదలు తప్పిపోయి తల్లడిల్లితి
నీ స్వరమును తిరిగి వినుటకు నీ సన్నిధి మోకరిల్లితి || 2 || || నన్ను మార్చుము ||