జీవాధిపతివి నీవే నా యేసయ్య
నాకున్న ఆధారము నీవేనయ్యా || 2 ||
నీవుంటే చాలు, కీడు కాదా! మేలు
లెక్కింపగా తరమా! నే పొందిన ఈవులు || 2 || || జీవాధిపతివి ||
ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు
అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు || 2 ||
నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యము
నీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము || 2 || || నీవుంటే చాలు ||
రాజుల హృదయాలను తిప్పువాడవు
నిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు || 2 ||
ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగను
నీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా || 2 || || నీవుంటే చాలు ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి