షాలోము రాజుకు వందనం
సీయోను పాటలు పాడెదాం || 2 ||
యేసు రాజ వందనం
మహిమ రాజ వందనం
మృత్యుంజయుడా వందనం
ముక్తి దాత వందనం || షాలోము ||
ఖాళీ అయినా సమాధి చూసి, చావు పరుగులు తీసెను అలసి
పాపమొందిన ఓటమి తెలిసి, పారి పోయెను అపవాది జడిసి || 2 || || యేసు రాజ ||
మొదటి ఆదాము చేసిన పాపం, మానవులపై తెచ్చెను మరణం
కనికరముతో కడపటి ఆదాము, గెలిచి మరణము తెచ్చెను జీవం || 2 || || యేసు రాజ ||
మనుష్యుడాదిలో పొందిన శాపం, నరకముకు తరలించె తరుణం
దైవ వాక్యము మనిషిగా మారి, నమ్మినంతనే పరము చేర్చే వైనం || 2 || || యేసు రాజ ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి