నన్ను మార్చుము దేవా, నన్ను మార్చుము ప్రభువా || 2 ||
నీ ఆజ్ఞలు మిరీతిని పాపమును చేరితిని
తనువు తపన తీర్చుటకు కపటమును నేర్చితిని || 2 || || నన్ను మార్చుము ||
పరిశుద్దతను విడిచి లోకములో పడిపోయితిని
పరలోకపు మార్గము మరచి నరకముకు నడిచితిని || 2 ||
నీ దండముతో సరిచేసి దయతో నీ దరికి చేర్చుము
జీవము గల నీ వాక్కులతో నాదు పాపములను చూపుము ||2 || || నన్ను మార్చుము ||
నీవు నాకు కాపరివైన కంచె దాటి పొయితి నేను
మంచి నాకు పంచిన గాని వంచనతో విడిచితి నిన్ను || 2 ||
నీ సన్నిధి విడిచిన మొదలు తప్పిపోయి తల్లడిల్లితి
నీ స్వరమును తిరిగి వినుటకు నీ సన్నిధి మోకరిల్లితి || 2 || || నన్ను మార్చుము ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి