సర్వోన్నత స్థలములలో వసియించు దేవుడు
సర్వ మానవాళి రక్షణకై భువిని చేరెను || 2 ||
అద్భుతమే, ఆశ్చర్యమే ఆయన పుట్టుక
సృష్టికారుడే మానవునిగా ఒదిగేను గనుక || 2 ||
హోసన్నా హోసన్నా అని ఆయన కీర్తిని చాటారే
హల్లెలూయా పాటలు పాడి స్తుతులను చెల్లించరే || సర్వోన్నత ||
అలసిన బ్రతుకులలోన, భారము తొలగించుటకు
అలజడి మనసులయందు శాంతిని కురిపించుటకు || 2 ||
అరుదెంచెను రారాజు పసిబాలునిగా
నిత్యుడైన తండ్రిగా రాజ్యమేలగా || హోసన్నా హోసన్నా ||
ఒంటరి మనుష్యుల కోసం తోడుగా పయనించుటకు
లోకము చీకటి తొలగే, వెలుగులనే పంచుటకు || 2 ||
ఎన్నటికి వీడిపోని నిజ స్నేహితుడై
ఉదయించెను మన కొరకే నీతి సూర్యుడై || హోసన్నా హోసన్నా ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి