లాలి లాలి అంటూ పాటలు పాడాలి
ఆ దేవుని కార్యములు సాక్ష్యము చెప్పాలి
ఈ గర్భ ఫలము ఆ దేవుని వరము
మా సంతానము తనకే అంకితము
ఆనాడు హన్నా ప్రార్థన విన్న వాడు
మాపై కూడా కృపను కురిపించినాడు || 2 ||
సమూయేలుగా మా సంతానమును పెంచాలి || 2 ||
ఎస్తేరు రుతులుగా వెలుగులో నడవాలి || 2 || || లాలి లాలి ||
ప్రతి ఆపద నుండి క్రీస్తును కాచిన దేవుడు
నిను కూడా నిత్యమూ నడిపించును గాక || 2 ||
పౌలు మాదిరి ప్రభు కొరకు పరుగెట్టాలి || 2 ||
విశ్వాసములో ప్రభు మెప్పును నువు పొందాలి || 2 || || లాలి లాలి ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి