అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు || 2 ||
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచెట్టి రక్షణను తెచ్చెను || 2 || || అందాల ||
భీతిల్లి పోయాము అ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునె గాంచి || 2 ||
గొల్లలము మేము కల్లలు ఎరుగము || 2 ||
కళ్లారా జూసాము తేజోమాయుని మోము || 2 || || రండయ్యో ||
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము || 2 ||
దారి చూపే తార రారాజునె-జేర || 2 ||
మొక్కము మోఁకఱిల్లి బాలుణ్ణి మనసారా || 2 || || రండయ్యో ||
తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసెయు రక్షకుడు || 2 ||
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు || 2 ||
నీ తప్పులెన్ని ఉన్న మన్నించుతాడు రేడు || 2 || || రండయ్యో ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి