నీ దేహమే తండ్రి ఆలయం, కాదు కనపడే ఆ భవనం
యేసు రాజు నిత్య ప్రేమతో, మారిపోయెను నీ గతం || 2 ||
వద్దు వద్దు వద్దు తొంగి చూడవద్దు - సాతానుకు మళ్ళి లొంగిపోవద్దు
నీతి నీలో ఉంటె ఆకాశమే హద్దు - దివ్య వాక్కులతో శోధనలు రద్దు || 2 || || నీ దేహమే ||
అలనాడు ఆ యోసేపు పాటించిన నిగ్రహము
ఆ యోబు కలతను మాని కనబరచిన నిబ్బరము || 2 ||
నీకు సాధ్యమే సత్యములో, పడబోకు లోకము వలలో
తలచు యేసు నామం మదిలో, తిరిగి రాదు పాపం నీలో || 2 || || వద్దు వద్దు వద్దు ||
దావీదు దేవుని మనసు ఎరిగిన వాడయినప్పటికి
ఎన్నెన్నో కోల్పోయెనుగా తను చేసిన తప్పు దాటీకి || 2 ||
తెలిసి చేయు పాప భారము, కలిగించును గొప్ప నేరము
పారిపోవ తగిన దూరము, ఆలకించు దేవుని స్వరము || 2 || || వద్దు వద్దు వద్దు ||
పౌలు అయినా సౌలు జీవితం కావాలి నీకు పాఠము
లక్ష్యము మరచిన సంసోను నేర్పాలి గుణపాఠము || 2 ||
నులి వెచ్చని బ్రతుకులోన, ఏ ఫలితము కానరాదు
దేవుని ప్రేమంటే అర్థం, పరిశుద్ధత మరచుట కాదు || 2 || || వద్దు వద్దు వద్దు ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి