అందమయిన మనసుకు - నేనొక చక్కని రూపం
బుద్ధిమంతురాలు ఎస్తేరుకు - నిలువెత్తున ప్రతిరూపం || 2 ||
హద్దులెవి దాటి ఎరుగవు నా ఊహలు
దేవుని పలుకులే నింపెను నా ఆశలు || 2 || || అందమయిన ||
ఇస్సాకు వంటి వానితో నా మనువు సేయ వెదికేరు
రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు || 2 ||
మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం
రుతులాగా కలిసిపోవడం నాకున్న గుణం || 2 || || అందమయిన ||
శుద్ధమయిన మరియామ్మ లాగ బుద్దిగా పెరిగాను
నీతిమంతుడయినా యోసేపు కై కాచుకొని ఉన్నాను || 2 ||
తండ్రి చిత్తమేదయినా పాటించుటకై సిద్దము
పొందుకున్న మారు మనసే, నా అందము || 2 || || అందమయిన ||
అమ్మ నాన్నల నుండి నేను, ప్రార్థన పలుకులు నేర్చాను
నా తొడబుట్టిన వారి తోని, అనుబంధాలే ఎరిగాను || 2 ||
క్రీస్తు సంఘమంత మాతో ఉన్న బంధు ఘనం
కనాను పెండ్లిలో అద్భుతమే మాకున్న ధైర్యం || 2 || || అందమయిన ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి