Gospel Songs Ministry

17, డిసెంబర్ 2021, శుక్రవారం

రారే చూతము రాజ సుతుని


రారె చూతము – రాజసుతుడీ – రేయి జనన మాయెను రాజులకు రా – రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో॥రారె॥

దూత గణములన్ – దేరి చూడరే – దైవ వాక్కులన్ – దెల్పగా దేవుడే మన – దీనరూపున – ధరణి కరిగెనీ – దినమున॥రారె॥ కల్లగాదిది – కలయు గాదిది – గొల్ల బోయల – దర్శనం తెల్లగానదె – తేజరిల్లెడి – తారగాంచరె – త్వరగ రారే॥రారె॥ బాలు డడుగో – వేల సూర్యుల – బోలు సద్గుణ – శీలుడు బాల బాలికా – బాలవృద్ధుల నేల గల్గిన – నాధుడు ॥రారె॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి