పరిచయమేగా నేను నీకు, నేను ఎవరో, నేనెరుగక మునుపే
నీ వాక్యములతో బలపరిచితివే, నేను నీలో, కొనసాగుట కొరకే
ఉన్నత స్థలములో నిలిచిన దేవా
నా స్నేహితుడై నడిపే ప్రభువా || 2 || || పరిచయమేగా ||
నిత్యమైన నీ సత్యము నెరిగి
విడిచితి నిన్నే చిత్తము చెదిరి || 2 ||
కన్నీటితో నీదు పాదాలు కడుగగా
కరుణించు యేసయ్య నా కరుకు కరుగగా || 2 || || పరిచయమేగా ||
మధురమయిన నీ ప్రేమను మరచి
మారాను గ్రోలితి వినయము విడిచి || 2 ||
మనసారా నిన్ను మన్నింపు కోరగా
వేడితిని నిన్నే చిత్తమును యివ్వగా || 2 || || పరిచయమేగా ||